Electricity | అక్రమంగా విద్యుత్ వినియోగం…

Electricity | అక్రమంగా విద్యుత్ వినియోగం…
Electricity | కన్నెపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండల కేంద్రంలో విద్యుత్ అక్రమంగా వినియోగిస్తూ సాక్షాత్తు రూ,,1. 43 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవణ నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారు. దహెగాం బెల్లంపల్లి రహదారిలో నూతనంగా నిర్మించిన కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనంకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ నుంచి విద్యుత్ ను అక్రమంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి వినియోగించడం చర్చనీయాంసంగా మారింది.
ఏడాది కాలానికి పైగా పోలీస్ స్టేషన్ భవనానికి సంబంధించిన విద్యుత్ ను అక్రమంగా వినియోగిస్తున్న విషయం విద్యుత్ శాఖ అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తు న్నారని ప్రజలు వాపో తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు వినియోగించడం చట్ట విరుద్ధమైనప్పటికీ ఈ విషయం తెలిసినా మండల విద్యుత్ శాఖ సిబ్బంది పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
యదేచ్ఛగా భవన నిర్మాణ గుత్తే దార్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా విద్యుత్ ను పీహెచ్ సీ భవన నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమోతున్నాయి. ఎవరైనా ప్రజలు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తే కేసులు నమోదు చేసే విద్యుత్ శాఖ అధికారులు బహిరంగంగా అక్రమంగా పీ హెచ్ సీకి వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కేసు నమోదు చేస్తాం… ఏఈ రాజనర్సు
కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనం నుంచి నూతన పిహెచ్ సీ భవన నిర్మాణానికి అక్రమంగా వినియోగిస్తున్న విద్యుత్ పై ఏ ఈ రాజనర్సును వివరణ కోరగా అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిని గుర్తించి విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తామని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు.
