జన్మదిన వేడుకల్లో వినిపించిన అభివృద్ధి చర్చ

జన్మదిన వేడుకల్లో వినిపించిన అభివృద్ధి చర్చ

సుల్తానాబాద్ ఆంధ్రప్రభ: తెలంగాణ అభివృద్ధిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీధర్ బాబు జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణకు అనేక పారిశ్రామిక సంస్థలను తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమల రంగాల అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

మంథని నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఆయన పాత్ర కీలకమని అన్నారు.

పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలుక సతీష్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply