Gold Rate Today | పసిడి ప్రియులకు గుడ్న్యూస్..
Gold Rate Today | పసిడి ప్రియులకు గుడ్న్యూస్..
Gold Rate Today | ఆంధ్రప్రభ వెబ్డెస్క్: బంగారం కొనాలనుకునే వారికి ఊరట లభించింది. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలపై ప్రభావం పడుతోంది.
జూన్ 10న బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర భారీగా పడిపోయి సుమారు రూ.1.48 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య ట్రేడ్ అవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి రూ.1.36 లక్షల నుంచి రూ.1.45 లక్షల మధ్య కొనసాగుతోంది. నగరాలు, జువెలరీ సంస్థలు, పన్నులు, మేకింగ్ ఛార్జీల ఆధారంగా ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.
