పేదింటిబిడ్డ పెండ్లికి…

పేదింటిబిడ్డ పెండ్లికి…

లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : పేదలకు అండగా ప్రభుత్వం ఉందని జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్(RTA Member Ankati Srinivas) అన్నారు. ఈ రోజు స్థానిక రైతు వేదికలో కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి మహిళకు పెండ్లి భారం(burden of marriage for a poor woman) కావద్దని, ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ లబ్దిదారులను మరచిపోవడం లేదన్నారు.

ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని వివరించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) నేతృత్వంలో అన్ని వర్గాల లబ్దిదారులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాది పేదల ప్రభుత్వం అని, మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని చూపుతున్నామని వివరించారు.

అనంతరం పలువురు లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరీఫ్, మండల అధ్యక్షుడు రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు, తహసీల్దార్ దిలీప్ కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply