Drainage | డ్రైనేజీ అధ్వానం

రాజంపేట కాలనీవాసుల అవస్థలు
Drainage | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాజంపేట కాలనీలో డ్రైనేజీ అధ్వానంగా ఉంది. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజంపేట కాలనీలో ఇండ్ల మధ్యలో మురుగు నీరు నిలిచిపోతుంది. రోడ్డు మీద ఉన్న గుంతల్లోకి నీరు చేయడంతో రాకపోకలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు.
దోమలు కూడా విజృంభిస్తున్నాయి. డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని రాజంపేట కాలనీ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర కోరారు. ఈ రోజు స్థానికులతో కలసి మురుగు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికులు మున్సిపాలిటీకీ పన్నులు చెల్లిస్తున్నా స్థానికంగా అభివృద్ధి జరగడం లేదని అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తో కలిసి రాజంపేటకాలనీని సందర్శించి సమస్యసు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫోరమ్ సహా కార్యదర్శి శ్రీకాంత్, స్థానికులు ధన్నారం మల్లేశం, వరకుమార్, భాగమ్మ, టేకుల రవీందర్, ఆనంద్ కుమార్, వడ్డే కనకయ్య, టేకుల మల్లేశ, సురేష్, ఆంజనేయులు, రమేష్, కృష్ణవేణి, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
