స్మశాన వాటిక పనులు త్వరగా పూర్తి చేద్దాం…

స్మశాన వాటిక పనులు త్వరగా పూర్తిచేద్దాం…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో స్మశాన వాటిక రహదారి పనులు త్వరగా పూర్తి చేసుకుందామని ఊట్కూర్ మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులుఎల్కోటి నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ రమేష్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట స్మశాన వాటిక పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతపేట, భరత్ నగర్, కుర్వగేరి, బీర లింగేశ్వర నగర్, శ్రీకృష్ణ నగర్, కాలనీలలో చనిపోతే వర్షాకాలం అంత్యక్రియలకు తీసుకువెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్మశాన వాటిక రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లగా స్మశాన వాటిక రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి నిధులతో స్మశాన వాటిక రహదారి పనులు ప్రారంభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

వర్షాకాలం నాటికి స్మశాన వాటిక రహదారిపనులు సమిష్టి కృషితో పూర్తి చేసుకుందామన్నారు. ఎన్నో ఏళ్ల నుండి స్మశాన వాటికకు రహదారి లేకపోవడంతో ఎట్టకేలకు పనులు ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ గరిడీ లక్ష్మారెడ్డి, మాజీ వార్డు సభ్యుడు అశోక్ ఆయా కాలనీలప్రజలు బసిరెడ్డి, తిరుపతి, మల్లేష్, వెంకటప్ప, అభిలాష్ రెడ్డి, నర్సిరెడ్డి, బలరాం తిప్పన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply