AP| లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు..

మంజూరుకు అనువైన స్థలం గుర్తించాలి
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు స్థలం ఇచ్చేవారు తహసీల్దార్ ని సంప్రదించాలి
మంత్రి పయ్యావుల కేశవ్..


AP|అనంతపురం ప్రతినిధి, ఆగస్టు 13(ఆంధ్రప్రభ) : ఉరవకొండ పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల మంజూరుకు అనువైన స్థలం గుర్తించడానికి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు అండ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా వెలుగొండ రోడ్డులో, రాయంపల్లి రోడ్డు నందు, రేణుమాకులపల్లి రోడ్డులో, గుంతకల్ రోడ్డులో భూములను పరిశీలించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు.

ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి వారి భూములు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇవ్వడానికి ఆసక్తి ఉన్నవారు ఉరవకొండ తహసీల్దార్ ని సంప్రదించవలెనని, లేదా భూసేకరణ పద్ధతి ద్వారా ఇళ్ళ స్థలాల కోసం భూములను తీసుకోవడం జరుగుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి వారి భూములు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.