Don 3 | డాన్ 2 వివాదానికి తెర పడినట్లేనా..?
Don 3 | డాన్ 2 వివాదానికి తెర పడినట్లేనా..?
Don 3 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ‘డాన్ 3’ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్ట్ నుంచి హీరో రణ్‌వీర్ సింగ్ వైదొలగిన నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఆయనపై నాన్-కోఆపరేషన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. సినిమా ఆలస్యమవడంతో నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, సుమారు రూ.45 కోట్ల నష్టపరిహారం అంశం తెరపైకి వచ్చింది.
అయితే ఈ నిర్ణయంపై రణ్‌వీర్ సింగ్ చట్టపరంగా స్పందించినట్లు తెలుస్తోంది. FWICEకు ఆయన లీగల్ నోటీసులు పంపిన నేపథ్యంలో పరిస్థితి మారింది. సినీ పరిశ్రమకు చెందిన పలు సంఘాల మధ్యవర్తిత్వంతో ఫెడరేషన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. రణ్‌వీర్‌పై విధించిన నాన్-కోఆపరేషన్ ఆదేశాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ వ్యవహారంలో నిర్మాతలకు నష్టం కలగకుండా చూడాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సూచించినట్లు సమాచారం. వివాదం పరిష్కార దిశగా సాగడంతో ‘డాన్ 3’పై నెలకొన్న అనిశ్చితి కొంతవరకు తగ్గినట్లైంది. అయితే ఈ పరిణామాలపై రణ్‌వీర్ సింగ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. మరోవైపు రణ్‌వీర్ తన తదుపరి సినిమాల పనుల్లో బిజీగా ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘డాన్ 3’ వివాదం ముగిసిన నేపథ్యంలో ఆయన కొత్త ప్రాజెక్టులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
