బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ…

బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ…
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ డివిజన్ 298 లో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న తరుణంలో, వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ఒక గొప్ప కొండంత అండగా నిలుస్తోందని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నడికొప్పు నాగరాజు ముదిరాజ్ పేర్కొన్నారు. 298వ డివిజన్‌కు చెందిన నాచారం మహేష్ యాదవ్ కురుమ కొడుకు కౌశిక్ వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ. 30,000 (ముప్పై వేల రూపాయలు) సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది.
ఈ నిధుల చెక్కును మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా బాధితుడి తండ్రి మహేష్ యాదవ్‌కు బుధవారం రోజు అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడి తండ్రి మహేష్ యాదవ్ మాట్లాడుతూ తన కుమారుని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని కోరిన వెంటనే స్పందించి, సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించడంలో చొరవ చూపిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నడికొప్పు నాగరాజు ముదిరాజ్‌కు, అలాగే చెక్కును అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సిహెచ్. మల్లారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలిచాయని, తక్షణమే స్పందించిన నాయకత్వానికి ధన్యవాదాలు అని బాధితుడి తండ్రి హర్షం వ్యక్తం చేశారు.
