Death anniversary | అన్నివర్గాలకు స్ఫూర్తి…

Death anniversary | అన్నివర్గాలకు స్ఫూర్తి…
- దేవినేని గాంధీ ఆశయం కోసం పని చేస్తాం..
- ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
- ఘనంగా దేవినేని గాంధీ 46వ వర్థంతి
Death anniversary | విజయవాడ, ఆంధ్రప్రభ : అన్ని వర్గాలకు అండగా ఉంటూ యువతలో స్ఫూర్తి నింపిన దేవినేని గాంధీ ఆశయాల కోసం పనిచేస్తూ ఉంటామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. దేవినేని గాంధీ 46వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ కార్యాలయంలో ఈ రోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో అప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, రామిరెడ్డి, అంబేడ్కర్, జగన్ నాయుడు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
