సైకిల్‌పై ప్రజా దర్బార్‌కు ఎమ్మెల్యే..

సైకిల్‌పై ప్రజా దర్బార్‌కు ఎమ్మెల్యే..

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

బాపట్ల, ఆంధ్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు సైకిల్‌పై మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ప్రజా దర్బార్‌లో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు, ఆరోగ్యకరమైన జీవన విధానానికి సైకిల్ వినియోగం దోహదపడుతుందని అన్నారు.

ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించి సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలు, సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి సైకిల్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply