హైదరాబాద్ – ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 15 ఓవర్ల లోనే 200 పరుగులను క్రాస్ చేసింది . ఈ క్రమంలో మూడో వికెట్ గా నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్ కు చేరాడు. 30 పరుగులు చేసిన నితీశ్ స్పిన్నర్ తీక్షణ కు చిక్కాడు.
ఇక రెండో వికెట్ గా ట్రావిస్ హెడ్ ను కోల్పోయింది . ట్రావీస్ చేసిన 67 పరుగులలో 3 సిక్సర్లు . 9 ఫోర్లు ఉన్నాయి. హెడ్ వికెట్ తుషార దేష్ పాండే కి దక్కింది .
ముందుగా . టాస్ ను గెలుచుకున్న ఆర్ ఆర్ కెప్టెన్ రియాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి బ్యాటింగ్ ఆరంభించిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు. 24 పరుగులు చేసిన శర్మ స్పిన్నర్ తీక్షణ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
ప్రస్తుతం ఇషాన్ కిషన్ 79 , క్లాసన్ ఒక పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 15 ఓవర్లలో మూడు వికెట్లు నష్ట పోయి 212 పరుగులు చేసింది