నా నగరం – నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించాలి…

నా నగరం – నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించాలి…
స్వచ్ఛ్ విజయవాడ లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : నా నగరం నా బాధ్యత అంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. బుధవారం తన పర్యటనలో భాగంగా బి.ఆర్.టి.ఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ నుండి భగత్ సింగ్ రోడ్ వరకు కాలినడకన పారిశుధ్య నిర్వహణపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కాలుష్య రహిత నగరాన్ని నిర్మించేందుకు ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నామని తద్వారా డస్ట్ లేకుండా కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ–2026 కార్యక్రమంలో భాగంగా నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ ప్రత్యేక శుభ్రత కార్యక్రమంలో పాల్గొని తామే స్వయంగా చీపురు పట్టుకొని రహదారి పరిసరాల్లో శుభ్రత నిర్వహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. నగర పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, స్వచ్ఛమైన విజయవాడ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ ఓటింగ్‌లో చురుకుగా పాల్గొని విజయవాడకు ఉత్తమ ర్యాంకు తీసుకురావాలని కోరారు. మరోవైపు టిఫిన్ బండ్ల వద్ద వారు వేడివేడి ఆహారాన్ని సింగల్ యూస్ ప్లాస్టిక్ కవర్ పై వేయటం వలన ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, నగరంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
కర్రీ పాయింట్ల వద్ద టిఫిన్ బండ్ల వద్ద వేడి వేడి ఆహారాన్ని 120 మైక్రోన్స్ కంటే తక్కువగా ఉన్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లలో వేయటం వల్ల, ఆ ప్లాస్టిక్ వేడిలో కరిగి ఆహారం ద్వారా శరీరం లోపలికి వెళ్లి క్యాన్సర్కి కారకాలు అవుతాయని అన్నారు. ఒకవైపు అధికారులు అధికారులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నప్పటికీ ప్రజలు కూడా తమ వైపు నుండి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మారివేయాలని పర్యావరణహితమైన వస్తువులనే వాడేటట్టు వారు కూడా బాధ్యత వహించాలని అన్నారు.
నగరంలోని భవన నిర్మాణాలను ప్రజలు సరిగా నిర్వహించకుండా కాలువల్లో పారి వేయటం వల్ల కాలువలు నిండిపోయి దోమలు వచ్చే అవకాశాలు నందున ప్రజలు అభ్యర్థాలను విజయవాడ నగరపాలక సంస్థ వారికి అందించాలని వియంసిపారు భవనం వ్యర్ధాల నుండి ఇటుకలు ఫీవర్ బ్లాక్స్ వంటి సంపదను సృష్టించే వస్తువులను తయారు చేస్తారని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ. శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
