Bheemgal ప్రైమరీ స్కూల్ మార్పుపై అంగన్‌వాడీల నిరసన

Bheemgal ప్రైమరీ స్కూల్ మార్పుపై అంగన్‌వాడీల నిరసన

భీమ్‌గల్ రూరల్ (Bheemgal), ఆంధ్రప్రభ: మండలంలోని అన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఫ్రీ ప్రైమరీ స్కూల్‌లుగా మార్చే నిర్ణయాన్ని రద్దు చేయాలని అంగన్‌వాడీ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి డి. స్వామికి గురువారం వినతిపత్రం అందజేశారు.

అంగన్‌వాడీ టీచర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ కింద ఉన్న 4,131 కేంద్రాల నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈ కేంద్రాలను పూర్తిగా అంగన్‌వాడీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఐసిడిఎస్ వ్యవస్థను బలోపేతం చేయాలని, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సెక్టర్లు ప్రమీల గంగాలక్ష్మి, సుజాత, అరుణ, సంగీత, వీణ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply