MLA | పనులు వేగవంతం చేయాలి

MLA | పనులు వేగవంతం చేయాలి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య


MLA | చేవెళ్ల, ఆంధ్రప్రభ : జాతీయ రహదారి పనులు (national highway work) వేగవంతం చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య (MLA Kale Yadayya) సూచించారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మొయినాబాద్ మండలం షాపూర్ స్టేజి వద్ద రహదారి విస్తరణ పనులను ఆయన స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

నాణ్యత ప్రమాణాల (Quality standards) తో రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు మలుపుల వద్ద తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, మలపుల రోడ్డు వెడల్పులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు విస్తరణ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాలు జరగకుండా రేడియం, సూచిక బోర్డులు, డివైడర్లు వంటివి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.