Central Govt | ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు

Central Govt | ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు

Central Govt | జుక్కల్, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి కేంద్ర ప్రభుత్వం(Central Govt) గాంధీజీ పేరును తొలగించి ఉపాధి హామీ పథకాన్ని నిర్వర్యం చేయవద్దని మండల కాంగ్రెస్ యువజన నాయకుడు సతీష్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ దేశాయ్, బొంపల్లి రాములు, మాజీ జడ్పిటిసి సాయ గౌడ్ డిమాండ్ చేశారు.

ఏఐసీసీ పిలుపుమేరకు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశం మేరకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్(Vikasit Bharat) జి రామ్ జి కొత్త పేరును ఖరారు చేసేన‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు ఈ రోజు జుక్కల్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీజి చిత్రపటాన్ని(Gandhiji’s portrait) చేత పట్టుకొని ధర్నా నిర్వహించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఉనికిని చాటుకునేందుకు స్వార్థ ప్రయోజనం కోసం మహాత్మా గాంధీ పవిత్రమైన పేరును సైతం తొలగించేందుకు సిద్ధం కావటం విడ్డురంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈనిర్ణయాన్ని మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply