13mayipl | ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే..

13mayipl | ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే..
13mayipl | ఈ రోజు ఐపీఎల్‌లో బెంగళూర్‌తో కోల్‌కతా ఢీ
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో..
రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం
జియో హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
10 మ్యాచ్‌లలో 4 గెలిచిన కోల్‌కతా
మిగిలిన 4 మ్యాచుల్లో గెలవాల్సిందే..
13mayipl | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ 57వ మ్యాచ్‌లో తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు జరగబోయే మ్యాచ్‌లో జియో హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ మ్యాచ్ కోల్‌కతా జట్టుకు డూ ఆర్ డై అని చెప్పవచ్చు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్‌కు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఇది. ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే గెలిచి, ఒకటి రద్దు కావడంతో కేకేఆర్ ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. మిగిలిన 4 మ్యాచ్‌లలో కేకేఆర్ కచ్చితంగా విజయం సాధించాలి. ఈ నాలుగు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా కోల్‌కతా జట్టు ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.
ఇక ఆర్సీబీ జట్టు మంచి పొజిషన్‌లో ఉంది. 14 పాయింట్లతో టేబుల్‌లో టాప్ 2లో ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూర్ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు మరింత చేరువకానుంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ పోటీల్లో ఇరు జట్లు 36 మ్యాచుల్లో ఢీకొన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 20 సార్లు గెలవగా, బెంగళూరు జట్టు 15 సార్లు విజయం సాధించింది, ఒక మ్యాచ్ ఫలితం రాలేదు.
CLICK HERE TO READ No More Nba Legend : ఎన్బీయే… గే లెజెండ్ ఇకలేరు Andhra Prabha Top Story
