రైతు, కార్మిక, నిరుద్యోగులను నిరాశపరచిన బడ్జెట్…
రైతు, కార్మిక, నిరుద్యోగులను నిరాశపరచిన బడ్జెట్…
సీపీఎం మండల కార్యదర్శి -తిప్పారపు శ్రీనివాస్
బెజ్జంకి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026- 27 బడ్జెట్లో రైతులను, కార్మికులను,నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని సిపిఎం మండల కార్యదర్శి – తిప్పారపు శ్రీనివాస్ అన్నారు. రైతాంగానికి ఈ బడ్జెట్ లో 23,179 కోట్లు కేటాయించినట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు. గత సంవత్సరం 24 వేల కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం తగ్గించారు.
వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఇందులో లేదు,కౌలు రైతులను విస్మరించారన్నారు. వ్యవసాయ రంగంలో ప్రకృతి వైపరీత్యాల పరిహారం, భీమా సౌకర్యం, మార్కెట్ జోక్యం కి నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకుంటామని చెప్పి మొండి చెయ్యి చూపిందన్నారు.
