Allu Arjun | అల్లు అర్జున్ రాకాలో.. షారుఖ్..?

Allu Arjun | అల్లు అర్జున్ రాకాలో.. షారుఖ్..?

Allu Arjun | ‘రాకా’పై పెరుగుతున్న బజ్
షారుఖ్ ఎంట్రీపై వైరల్ టాక్
ఇది కేవలం రూమర్నా..?
ఫ్యాన్స్‌లో పెరిగిన ఎక్స్‌సైట్‌మెంట్

Allu Arjun | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రాకా. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం.. ఒక రకంగా షాక్ ఇవ్వడంతో.. మరింత బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ గురించి అప్ డేట్స్ ఇస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఇది నిజమేనా..?

Allu Arjun | కీలక పాత్రలో షారుఖ్..

Allu Arjun

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా సినిమా విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతారనే వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం షారుఖ్ ఖాన్‌ను సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా గ్లోబల్ రేంజ్‌లో ఉండబోతుందని, అందుకే బాలీవుడ్ స్టార్‌ను తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్టు టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.

Allu Arjun | నిజమా..? రూమరా..?

Allu Arjun

ప్రస్తుతం ఈ వార్తపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఇలాంటి రూమర్లు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కూడా పలు సెలబ్రిటీల గురించి తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల ఇది ఇప్పటికి కేవలం ఊహాగానమే అనే చెప్పాలి. అయితే.. షారుఖ్ తో అట్లీ జవాన్ సినిమా తీయడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందచేత అట్లీ అడిగితే.. షారుఖ్ నో చెప్పకపోవచ్చు. రీసెంట్ గా రాకా మూవీ ఫస్ట్ లుక్ గురించి.. షారుఖ్ సోషల్ మీడియాలో స్పందించారు. బన్నీకి బర్త్ డే విషేష్ తెలియచేశారు. అందుచేత షారుఖ్ నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నిజం అవ్వచ్చు అని కూడా ప్రచారం జరుగుతుంది.

Allu Arjun | అభిమానుల్లో ఎక్స్‌సైట్‌మెంట్..

Allu Arjun

ప్రస్తుతం ఇండియన్ సినిమా పాన్-ఇండియా, పాన్-వరల్డ్ స్థాయికి ఎదుగుతోంది. అల్లు అర్జున్ పుష్ప విజయంతో ఇప్పటికే నేషనల్ లెవల్ స్టార్‌గా ఎదిగారు. మరో వైపు షారుఖ్ ఖాన్ కూడా పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో భారీ మార్కెట్ సంపాదించారు. ఈ ఇద్దరి కలయిక జరిగితే అది నిజంగా సెన్సేషన్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Allu Arjun

ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ + షారుఖ్ కాంబో అయితే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినా, ఈ కాంబినేషన్‌ పై చర్చ మాత్రం ఊపందుకుంది. నిజంగా షారుఖ్ ఇందులో నటించడం కన్‌ఫర్మ్ అయితే.. అది ఇండియన్ సినిమా చరిత్రలో సెన్సేషన్ అవుతుంది. చూడాలి మరి.. ఏం జరగనుందో..?

Leave a Reply