Big Boss | KCR | బిగ్‌ బాస్ కొత్త‌లుక్‌!

Big Boss | KCR | బిగ్‌ బాస్ కొత్త‌లుక్‌!

  • జ‌ల‌దోపిడీపై కేసీఆర్ ఉద్య‌మం
  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాటానికి బీఆర్ఎస్‌ బాస్ రెడీ!
  • ఉమ్మ‌డి పాల‌మూరు వేదిక‌గా క‌ద‌ల‌నున్న గులాబీ దండు

Big Boss | KCR | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బీఆర్ఎస్(బిగ్‌)బాస్‌ కొత్త లుక్‌తో వ‌చ్చారు.. గులాబీ దండులో ఉత్స‌హం మ‌రింత పెరిగింది. రెండేళ్లు ఫామ్ హౌస్‌(Farm house)కు ప‌రిమిత‌మైన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష‌నేత కె.చంద్ర‌శేఖ‌ర్ రావు(కేసీఆర్‌)నిన్న పార్టీ కార్యాల‌యంలో మ‌రోసారి అడుగు పెట్టారు. అది మామూలు అడుగు కాదు… తెలంగాణ కోసం ఉద్య‌మ‌స్ఫూర్తి(Enthusiasm) అడుగు.. ఇదే క‌దా బీఆర్ఎస్ శ్రేణులు కూడా కోరుకునేది! ఈ రోజు కోస‌మే క‌దా వారంతా వేయి క‌ళ్ల‌తో ఎదురు చూశారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఫామ్ హౌస్ నుంచి ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.తార‌క రామారావు (కేటీఆర్‌)కు దిశ నిర్దేశించి పార్టీని న‌డిపించ‌డంలోనూ, ప్ర‌భుత్వ విధానాల‌(Government policies)ను ఎండ‌గ‌ట్ట‌డంలోనూ విజ‌యం సాధించారు. అయితే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ ఫేస్ క‌నిపించాలి.. కేసీఆర్ నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట‌కు తెలంగాణ ప్రజలు విలువ ఇస్తారు. అందుకే రెండేళ్ల త‌ర్వాత బీఆర్ఎస్ (బిగ్‌)బాస్ కొత్త పంథాలో(In a new way) అడుగుపెట్టాల్సి వ‌చ్చింది! ప్ర‌భుత్వానికి కావాల్సినంత స‌మ‌యం ఇచ్చాన‌ని, ఇప్పుడు తానే రంగంలోకి దిగుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు.

Big Boss | KCR | ఆనాడు జోగులాంబ అమ్మ‌వారి ఆశ్శీసుల‌తో…

Big Boss

తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తొలినాళ్లలో 2003 మే 20వ తేదీన అలంపూర్‌ నుంచి కేసీఆర్‌(KCR from Alampur) పాదయాత్ర ప్రారంభించారు. మే 25న గద్వాలకు చేరారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఆ పాదయాత్ర సంచలనమైంది. శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆశీస్సుల‌తో సుదీర్ఘ కాల పోరాటాల ఫలితంగా(As a result of the struggles) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాలకుల నిర్ల‌క్ష్యానికి పెండింగ్‌ ప్రాజెక్టుల జాబితాలో జమ అయిన బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, జూరాల ప్రాజెక్టులను పూర్తి చేశార‌ని పార్టీ శ్రేణులు మాట‌. పాల‌కుల నిర్ల‌క్ష్యంతోనే పాల‌మూరుకు అన్యాయం జ‌రుగుతుంద‌ని, అక్క‌డ నుంచే ఉద్య‌మానికి శ్రీ‌కారం(The beginning of the movement) చుట్ట‌డానికి గులాబీ బాస్ సిద్ధ‌మ‌య్యారు.

Big Boss | KCR | సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి…

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి మ‌ళ్లీ ఉద్య‌మించాల‌ని కేసీఆర్(kcr) నిర్ణ‌యించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు దత్తపుత్రుడినని ఊదరగొట్టిన చంద్రబాబుకు ఏ రీతిలో ఉద్యమ రుచి చూపించారో, ఇప్పుడు నల్లమల పులిబిడ్డనని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీ రుచి చూపిస్తార‌ని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. నాడు చంద్ర‌బాబు నాయుడు.. నేడు రేవంత్ రెడ్డి.. పాలమూరు బతుకును బుగ్గిపాలు చేస్తే ఊరుకోబోమని, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే పోరాటం మొదలవుతుందని కేసీఆర్‌ అల్టిమేటం జారీచేశారు.

Big Boss | KCR | నెల రోజుల‌పాటు జ‌ల‌దోపిడీపై పోరాటం

ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో నాటి జలసాధన ఉద్యమాన్ని తలపించే విధంగా జలపోరాట కార్యాచరణను సిద్ధం చేసినట్టు స్పష్టమవుతున్నది. ఊరూరా ఉద్యమ దండోరా(The movement of the Urura) మోగించడం, బీఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, తద్వారా కృష్ణా బేసిన్‌ ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించడం, రేవంత్‌రెడ్డి సర్కార్‌ తెలంగాణ ప్రయోజనాలను ఎలా తాకట్టుపెడుతున్నదో, తెలంగాణ శాశ్వత హక్కులను ఎలా గంగపాలు చేస్తున్నదో ప్రజలకు అర్థమయ్యేలా ప్రజాచైతన్య(Public consciousness) కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కేసీఆర్‌ మాటలతో స్పష్టమైంది. మొత్తానికి అప్పుడూ, ఇప్పుడూ అదే పాలమూరు వేదిక‌గా కేసీఆర్‌ రంగంలోకి దిగుతున్నారు.

Big Boss | KCR | ప్ర‌భుత్వం మాట్లాడ‌క‌పోతే.. ప్ర‌తిప‌క్ష‌మే మాట్లాడాలి..

Big Boss

‘రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాట్లాడకుంటే .. ప్రతిపక్షమే కదా మాట్లాడాలి. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా మేమే వాయిస్ పెంచాలి. ఇయ్యాల్టి దాకా వేరే కథ.. రేపటి నుంచి వేరే కథ. ఎక్క‌డికక్క‌డ‌ తోలు తీస్తాం’ కేసీఆర్ అన్నారు. ‘ప్రజలతో కలిసి ఎక్క‌డిక‌క్క‌డే నిలబెట్టే ప్రయత్నం చేస్తం.. అడుగడుగునా చెక్‌ చేస్తం. ప్రతి విషయంలో చెక్‌ చేస్తం. మేము తొందరపడి మీ మీద కన్నెర్ర జేయడం లేదు. మీకు చాలా పెద్ద సమయమే(Big time) ఇచ్చినం. మా ప్రభుత్వం పోయింది.. వీళ్లు వచ్చిండ్రని పిచ్చి పిచ్చిగా చేయడం లేదు. అలాంటి వాటి జోలికిపోలే. ఇష్యూల మీద మాత్రమే పోరాడుతున్నం.. వక్ఫ్‌ ఇష్యూస్‌ మీద పోరాడుతున్నం. రకరకాల భూదందాల మీద.. దోపిడీ మీద.. లగచర్ల మీద పోరాడుతున్నం. పార్టీ కొట్లాడుతున్నది. బరాబర్‌(equal) కొట్లాడుతం.’ అని త‌న దైన శైలిలో కేసీఆర్ మాట్లాడారు.

Big Boss | KCR | నీళ్ల వాటా కోసం…

నీళ్ల వాట కోసం కొట్లాడుతామ‌ని కేసీఆర్ అన్నారు. ఏపీ ప్రభుత్వం నల్లమల సాగర్‌, ఈ సాగర్‌, ఆ సాగర్‌ అంటూ నీళ్ల దోపిడీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందని, ఇటు కృష్ణలో పాలమూరు ఎత్తిపోతలకు(Palamuru Lift Irrigation) అన్యాయం జరుగుతున్నా స్పందించ‌డం లేదని అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉంద‌ని ప్ర‌శ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో తానే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నట్లు ప్ర‌క‌టించారు. నాలుగు రోజుల్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఉద్య‌మానికి శ్రీ‌కారం చుడ‌తామ‌న్నారు. రాష్ట్ర హ‌క్కుల‌ను ర‌క్షించుకోవాలి… జ‌ల హ‌క్కుల‌ను ర‌క్షించుకోవాలి… రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను(People’s interests) రక్షించుకోవాలి… అందుకే పోరాటానికి దిగుతాన‌ని స్ప‌ష్టం చేశారు.

CLICK HERE TO READ న‌ల్ల బంగారానికి నూరేళ్ల నిబ‌ద్ధ‌త‌..

CLICK HERE TO READ MORE

Leave a Reply