Ayodhya | రామయ్య క్షేత్రంలో..

Ayodhya | రామయ్య క్షేత్రంలో..
Ayodhya, మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో ఈనెల 30వ తేదీన అతి పురాతనమైన కోనేరు ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం జరగనుంది. దీనికి అయోధ్య సరయు నది, కాశీ (Kaashi) గంగానది పవిత్ర జలాలను తీసుకువచ్చి శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్త పి.ప్రాణేషాచారికి మంగళవారం స్వామి వారి భక్తులు మక్తల్ పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ జిల్లా గౌరవ సలహా సభ్యులు వి. భీమ్ రెడ్డి కుటుంబ సభ్యులు అందజేశారు. తన 50వ పుట్టినరోజు సందర్భంగా తన సతీమణితో కలిసి అయోధ్య కాశీ క్షేత్రములకు వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల మొదటి ఆహ్వాన పత్రికను అయోధ్య రామయ్య క్షేత్రంలో అందించి అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు.
అనంతరం వారణాసిలోని (Varanasi) కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. స్థానిక మక్తల్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం, రాంలీల మైదానం క్షేత్రంలో ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతనమైన కోనేరును పునరుద్దించారు. రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి సహకారంతో అతి పురాతనమైన కోనేరును పునరుద్ధరించి చరిత్రలో భక్తులందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ శుభ సందర్భముగా అయోధ్య క్షేత్రములోని సరయు నది నుండి కాశీ క్షేత్రములోని గంగానది పవిత్ర జలాలను తీసుకువచ్చి ఆలయ ధర్మకర్తకు అందించడం జరిగింది. ఈనెల 30న కోనేరు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా గంగాజలాలకు ఆలయ ధర్మకర్త ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరయు, గంగానది నుండి జలాలను తీసుకొచ్చిన భక్తుడిని ఈ సందర్భంగా ఆయన సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో భజరంగ దళ్ జిల్లా సహసంయోజక్ పసుపుల భీమేష్, రవీందర్ రెడ్డి, విజయ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
