ఘనంగా నల్లపువార్‌ ప్రసాద్‌ జన్మదిన వేడుకలు..

జుక్కల్‌/కామారెడ్డి, ఆంధ్రప్రభ : జుక్కల్‌ మండల కాంగ్రెస్‌ యువనాయకుడు, గుండూరు గ్రామవాసి నల్లపువార్‌ ప్రసాద్‌ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా యువ నాయకుడు నల్లపువార్‌ ప్రసాద్‌తో కేక్‌ కట్‌ చేయించి, స్వీట్‌ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

కాంగ్రెస్‌ యువ నాయకులు ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు చేరువ చేయాలని కోరారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ జుక్కల్‌ మండల అధ్యక్షుడు రమేష్‌ దేశాయ్‌, కాంగ్రెస్‌ యువజన అధ్యక్షుడు సతీష్‌ పటేల్‌, సర్పంచుల సంఘం జుక్కల్‌ మండల అధ్యక్షుడు చాకలి కృష్ణ, విజయ్‌ బాబు పటేల్‌, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.