అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైద‌రాబాద్ : తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ శాస‌న‌స‌భ‌ను, చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మండ‌లిని ప్రారంభించారు.

అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాగానే.. ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యేలకు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, నివాళులర్పించారు. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతిపట్ల సభ సంతాపం వ్యక్తం చేసింది. మరోవైపు శాసనమండలిలోనూ ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్‌ టి రత్నాకర్ (T Ratnakar), ఎం.రంగారెడ్డి (M. Rangareddy) మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

Leave a Reply