AP | విప‌క్ష హోదా ఒక‌రిచ్చేది కాదు … ప్ర‌జ‌లే ఇవ్వాలి – జ‌గ‌న్ కు ప‌వ‌న్ కౌంట‌ర్

వెల‌గ‌పూడి – అసెంబ్లీలో వైసిపి కి విప‌క్ష హోదా ఇవ్వాల‌ని కోరుతున్న ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ కు జ‌న‌సేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌంట‌ర్ ఇచ్చారు.. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, 11 సీట్లు ఉన్న వైసిపి కి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అంటూ నిలదీశారు. అసలు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదన్నారు. వైసీపీకి 11 సీట్లే వచ్చినా స్పీకర్ ఇన్ని రోజులు వాళ్లకు సరైన గౌరవం ఇచ్చారని చురకలు అంటించారు పవన్ క . ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి అంటూ ఆహ్వానించారు.. అసెంబ్లీలో వైసిపి కంటే త‌మ‌దే పెద్ద పార్టీ అని పేర్కొన్నారు.. విప‌క్ష హోదా అనేది ఒక‌రిచ్చేది కాద‌ని, అది ప్ర‌జ‌లే ఇవ్వాల‌ని జ‌గ‌న్ కు హిత‌వు ప‌లికారు..

.వైసీపీ నాయకులు స‌భ‌లో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం, బాధ్యత ఉందని తెలిపారు . తొలి రోజునే గవర్నర్ ప్రసంగం ఎలా అడ్డుకుంటారని ప్ర‌శించారు ప‌వ‌న్ . ప్రజల తీర్పు గౌరవించండని ఫైర్ అయ్యారు. వైసిపి స్థాయికి. తగ్గట్టు అసెంబ్లీ లో అవకాశాలు ఉంటాయని తెలిపారు. స్పీకర్ కూడా చాలా గౌరవంగా సమయం ఇచ్చారని వైసిపి ని ఎట్టి పరిస్థితి లో ఇబ్బంది పెట్టలేదని వివరించారు. వైసిపి హుందాగా ఉండాలని కోరారు పవన్ కళ్యాణ్.

Leave a Reply