భరోసా పార్టీ స్థాపకుడు చింతల యేసయ్యే : రావు సుబ్రహ్మణ్యం

భరోసా పార్టీ స్థాపకుడు చింతల యేసయ్యే : రావు సుబ్రహ్మణ్యం

  • ఫాస్టర్ అభినయ్ దర్శన్ వ్యాఖ్యల్లో నిజం లేదని ఆరోపణ
  • పాడేరు దొంగ దాడి కేసు ముద్దాయి వ్యవహారంపై వివరణ

చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ: భరోసా పార్టీని తానే స్థాపించానంటూ ఫాస్టర్ అభినయ్ దర్శన్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అసలు భరోసా పార్టీని కడప జిల్లాకు చెందిన చింతల యేసయ్య స్థాపించారని, ఆయన్ను కూడా అభినయ్ దర్శన్ మోసం చేశాడని ఆరోపించారు.

చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన రావు సుబ్రహ్మణ్యం, ఈ అంశంపై భరోసా పార్టీ అధ్యక్షుడు చింతల యేసయ్యతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. తన సూచనల మేరకు అభినయ్ దర్శన్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకునేందుకు యేసయ్య సిద్ధమవుతున్నారని వెల్లడించారు.

అలాగే ఈ వ్యవహారంపై విజయనగరం జిల్లా ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేయనున్నట్లు యేసయ్య తనకు తెలిపారని చెప్పారు. గతంలో లోక్ తాంత్రిక్ జనతా దళ్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభినయ్ దర్శన్ పోటీ చేసిన సందర్భంలో, నామినేషన్ తిరస్కరణకు గురైన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇటువంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రావు సుబ్రహ్మణ్యం సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply