AP | కలెక్టర్ కు సీఎం అభినందనలు

AP | కలెక్టర్ కు సీఎం అభినందనలు
AP | (ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో ) : నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడేలా మలిచిన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. పలు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు ఇలా వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లాలోని బాలికల సంక్షేమ వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్నివిరేటర్లు సమకూరాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా అనవసరపు ఖర్చు చేయకుండా ఇతరులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇటీవల చేసిన సూచనకు జిల్లా అధికార యంత్రాంగం స్వచ్చందంగా సహకరించింది.
గుర్తించిన అవసరాలకు అనుగుణంగా ఇన్సినరేటర్లు, విద్యార్థులు కూర్చునేందుకు చిన్న బల్లలను వివిధ శాఖల అదికారులు సమకూర్చారు. నూతన సంవత్సర కానుకలుగా కలెక్టర్ గురువారం ఒక్కోటి రూ.12,500లు చేసే 48 ఇన్సినిరేటర్లు, 972 చిన్న బల్లలను హాస్టళ్ల అదికారులకు అందజేశారు. వీటిని సమకూర్చిన సిబ్బందిని అభినందించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ కు ప్రత్యేకంగా అభినందనలను తెలిపారు.
