టిడిపి ఆవిర్భావ దినోత్సవం..

టిడిపి ఆవిర్భావ దినోత్సవం..

బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించగా, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. బంటుమిల్లి మండలం నాగేశ్వరావుపేట, బంటుమిల్లి, మల్లేశ్వరం, అర్థమూరు గ్రామాలలో 44 వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంటుమిల్లి, మల్లేశ్వరం గ్రామాలలో డాక్టర్ అంబేత్కర్ విగ్రహానికి పూలమాలవేసి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం అర్థమూరు గ్రామంలో కీ”శే నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి తెలుగుదేశం పార్టీ జెండా పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఎగురవేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply