సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీసీపీ షిరిన్ బేగం

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీసీపీ షిరిన్ బేగం

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న డీసీపీ షిరీనా బేగం..
కార్యక్రమంలోప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డీసీపీ..
ఐక్యతకు ప్రతీకగా నిలిచిన షిరిన్ బేగం

విజయవాడ, క్రైమ్, ఆంధ్రప్రభ : విజయవాడలోని కార్ క్వార్టర్స్‌లో రామాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం హాజరై సీతారాముల దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులతో మమేకమై పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
వివిధ మతాలకు చెందిన వ్యక్తులు పరస్పరం గౌరవంతో ఒకరికొకరు పండుగల్లో భాగస్వామ్యం కావడం సమాజంలో సౌహార్దాన్ని పెంపొందించే అంశంగా నిలుస్తోంది. భిన్న మతానికి చెందిన అధికారిని గా ఉన్నప్పటికీ, ఎటువంటి విభేదాలు లేకుండా హిందూ పండుగలో పాల్గొని భక్తులతో కలిసి పూజల్లో పాల్గొనడం ద్వారా డీసీపీ షిరిన్ బేగం ఐక్యతకు ప్రతీకగా నిలిచారు.ఇలాంటి సంఘటనలు సమాజంలో పరస్పర గౌరవం, సోదరభావాన్ని మరింత బలపరుస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply