అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు.. అమర్నాథ్ యాత్ర తేదీలను ఖరారు చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ గుహకు వార్షిక యాత్ర జూలై 3న ప్రారంభం కానుంది. 39 రోజుల పాటు కొనసాగునున్న ఈ యాత్ర ఆగస్టు 9న ముగుస్తుంది.
అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ఛైర్మన్ జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షత వహించిన పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తేదీలు నిర్ణయించడంతో తీర్థయాత్రకు సజావుగా ఏర్పాట్లు జరిగేలా చూసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.
అమర్‌నాథ్యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
పవిత్ర మందిరం సందర్శనకు పెద్ద సంఖ్యలో భక్తులకు తరలి వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సులభంగా అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులకు భద్రత, వైద్య సదుపాయాలు కల్పిస్తారు.