ఏఎల్ ఎంకు బహుమతి..

కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; ఖమ్మం పట్టణంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి ట్రాన్స్ కో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటల పోటీల్లో రాష్ట్రస్థాయి మూడవ బహుమతిని కడెం మండలానికి చెందిన అసిస్టెంట్ లైన్ మెన్ మహేష్ కు మూడో బహుమతినీ గెలుపొందారు. రాష్ట్రస్థాయి పాటల్లో పోటీలో పాల్గొని మూడో బహుమతి సంపాదించడం తొ కడెం విద్యుత్ శాఖ ఏఈ రాంసింగ్ జిల్లా స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్ చోకోటి శ్రీనివాస్, ట్రాన్స్ కో యూనియన్ యూనియన్ నాయకులు రమణ,పోచయ్య ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో కూడా పలు రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు మహేష్ సంపాదించాడని ఇలాంటి బహుమతులు మరెన్నో అందుకోవాలని విద్యుత్ శాఖ సిబ్బంది ఆయనను అభినందించారు.

Leave a Reply