accident | ట్రాక్టర్ ఢీకొని 28 గొర్రెలు మృతి

accident | ట్రాక్టర్ ఢీకొని 28 గొర్రెలు మృతి

accident | లక్షేటిపేట, ఆంధ్ర ప్రభ : మండలంలోని సూరారం గ్రామ స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్ ఢీ(Tractor collision)కొని సుమారు 28 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ ఈ రోజు సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, నారాయణపేట అశోక్ నగర్ కు చెందిన కర్రెపోలా గజలప్ప తన గ్రామం వద్ద తనకున్న గొర్రెలకు మేత దొరకకపోవడంతో ఆయనకున్న గొర్రెలను పట్టుకొని తిప్పుతూ మేపుతూ ఉంటాడన్నారు.

అదే క్రమంలో తనకున్న గొర్రెలను నిన్నటి వరకు దండేపల్లి మండలంలో మేపి వాటిని ఈరోజు మంచిర్యాల వైపు తీసుకెళ్తుండగా లక్షెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపు సిమెంట్ ఇటుకలలోడుతో వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ తన ట్రాక్టర్ను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ గొర్రెల మంద పైకి రావడంతో 28 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయన్నారు. గొర్రెల యజమాని గజలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Leave a Reply