EO | ఆకస్మిక తనిఖీలు

EO | ఆకస్మిక తనిఖీలు

  • ఇంద్రకీలాద్రిపై దర్శన సేవల్లో నాణ్యత పెంపే లక్ష్యంగా

EO | ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆలయ ఈఓ వి.కె.శీనా నాయక్ ఇవాళ‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఉప ప్రధాన అర్చక శంకర శాండిల్య, అర్చక బృందం, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డి.ఈ. బొప్పన అశోక్ కుమార్, ఏఈఓ బి.వెంకటరెడ్డి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

EO

పూజా మండపాలు, ఉచిత ప్రసాద వితరణ కేంద్రం, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం, ఉచిత వైద్య శిబిరాన్ని ఈఓ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రసాద వితరణలో వినియోగించే పాత్రల శుభ్రత, యంత్ర పరికరాల సమర్థ పనితీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఆలయ ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

విధుల్లో ఉన్న అర్చకులు, నర్సులు, కొబ్బరికాయల కాంట్రాక్టర్లతో మాట్లాడి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంతృప్తి స్థాయిని పెంచేలా ప్రతి ఉద్యోగి బాధ్యతగా విధులు నిర్వహించాలని, ఆలయ ప్రతిష్టకు భంగం కలగనీయరాదని ఈఓ స్పష్టం చేశారు. దర్శన సేవల్లో అలసత్వం సహించబోమని ఈ సందర్భంగా సిబ్బందిని హెచ్చరించారు.

Leave a Reply