China Manja | అమ్మినా, వాడినా కఠిన చర్యలు…
China Manja | అమ్మినా, వాడినా కఠిన చర్యలు…
- ఏస్సై ఎస్. శ్రావణి
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : చైనా మాంజా అమ్మినా వాడినా కఠిన చర్యలు తప్పవు అని ఏస్సై ఎస్. శ్రావణి హెచ్చరించారు. ఈ రోజు మండలం లోని పలు దుకాణాల్లో చైనా మంజా వినియోగిస్తే జరిగే అనర్థాల గురించి వివరిస్తూ తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా (నైలాన్ లేదా సింథటిక్ దారం) వినియోగం ప్రాణాంతకం చాలా పదునుగా ఉంటుందనీ, రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారుల మెడకు తగిలితే తీవ్ర గాయాలు లేదా మరణం సంభవించవచ్చు అని ఏస్సై తెలిపారు.
చెట్లపై చిక్కుకున్న ఈ దారం పక్షుల రెక్కలకు చుట్టుకోని అవి ఎగరలేక చనిపొయే అవకాశం ఉందన్నారు. విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టే ప్రమాదం ఉందన్నారు. దీనిని విక్రయించినా లేదా నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. మీ పరిసరాల్లో ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని ఏస్సై సూచించారు.
