Flamingo Festival | పక్షుల పండుగకు వేళాయె

Flamingo Festival | పక్షుల పండుగకు వేళాయె

  • ఫ్లెమింగో ఫెస్టివల్ కు స్వాగతం ప‌లుకుతూ ర్యాలీ
  • ఈ నెల 10, 11 తేదీల్లో సూళ్లూరుపేటలో జరిగే ఫ్లెమింగో వేడుకలు
  • పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన అధికారులు
  • పక్షుల పండుగను వీక్షించేందుకు పిల్లలకు ఉచిత బస్సుల సౌకర్యం
  • పక్షుల ప్రేమికుల కోసం శ్రీసిటీ లో రెండురోజులు వర్క్ షాప్ నిర్వహణ
  • సీసీ కెమరాలు, డ్రోన్ సహాయంతో క్రౌడ్, ట్రాఫిక్ కంట్రోల్
  • ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం ప్రత్యేక భద్రతా చర్యలు

Flamingo Festival | తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పక్షుల పండగకు స్వాగతం పలుకుతూ ఈ నెల 10, 11 తేదేలలో సూళ్లూరుపేటలో ఫ్లెమింగో వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర తెలిపారు. ఇవాళ‌ ఉదయం స్థానిక ఎస్. వి యూనివర్సిటీ తారకరామ మైదానం నుంచి నాలుగు కాళ్ళ మండపం వరకు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షీ, పర్యాటక శాఖ ఆర్ డి రమణ ప్రసాద్, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ రమేష్ నాద్ లింగుంట్ల, జిల్లా విద్యా శాఖాధికారి కె.వి.ఎన్ కుమార్, సమగ్ర శిక్ష సీఎంఓ సురేష్, ఎంఈఓ బాలాజీ, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు.

Flamingo Festival

ఈసందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తిరుపతి జిల్లాలో పులికాట్ సరస్సు తీరాన ఈనెల 10, 11 తేదీల్లో ఫ్లెమింగో వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గత ఏడాది మూడు రోజులు పాటు ఘనంగా ఈ పక్షుల పండగ నిర్వహించామని, దాదాపు 3 నుండి 4 లక్షలకుపైన సందర్శకులు నేలపట్టు, అటకాని దిబ్బ, బివి పాల్యం బోటింగ్, సూళ్ళూరు పేటలో నిర్వహించినటువంటి వివిధ రకాల స్టాల్స్, ఆటల పోటీలు, ఫ్లెమింగో పక్షులు, నేలపట్టుకు వచ్చే అనేకమైన పక్షుల జాతులను గమనిస్తూ వాటిని, వాటి పర్యావరణాన్ని, ఎకో సిస్టంను పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Flamingo Festival

ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. బివి పాల్యంలో స్థానిక బోట్స్ మెన్ సొసైటీల చేయూత కోసం బోటింగ్ కోసం మినిమల్ ఫీజ్ పెట్టడం జరిగిందని, వచ్చిన మొత్తాన్ని మత్స్యకారుల సంఘాలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. చాలా అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నామని తెలిపారు. నిఘా నేత్రం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నామని, సీసీ కెమరాలు, డ్రోన్ సహాయంతో క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మూమెంట్, ఎలాంటి సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తూ ఉంటామని తెలిపారు.

Flamingo Festival

స్థానిక శాసనసభ్యులు వారి ఆద్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ఒక మంచి వాతావరణంలో ఈ సారి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. గౌరవ, జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేశ్, దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమానికి 10,11 తేదీలలో ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారని తెలిపారు.

Flamingo Festival

సందర్శకులు పక్షులను వీక్షించి టూరిజం పెంపొందించుటకు కృషి చేయాలని తెలిపారు. పెద్ద ఎత్తున ఫ్లెమింగో ఫెస్టివల్ ను టూరిజం ఇస్ ది బిగ్గెస్ట్ ఇజం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతుంటారని, ఆయన మాటలను స్పూర్తిగా తీసుకొని టూరిజం అభివృద్ధి దిశగా కృషి చేస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తూ, సందర్శకులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొస్తూ.. జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ జి ఓ లను భాగస్వామ్యం చేశామని తెలిపారు. శ్రీ సిటీ, ఇండస్ట్రీస్, ఐఐటి, ఐజర్, పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎస్.వి యూనివర్సిటీ వారి ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో తీసుకేల్లెందుకు కృషి చేస్తామన్నారు.

Leave a Reply