MLA | నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు

MLA | నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు

  • ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్

MLA | ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో : కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు వెచ్చిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తెలిపారు. ఇవాళ చల్లపల్లి మండల పరిధిలోని పాగోలు గ్రామంలో రూ.36లక్షలతో నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

తొలుత ఘంటసాల గ్రామంలోని మల్లంపల్లి రహదారిలో గంజి ఏడుకొం డలు నిర్మించిన రూ.2 లక్షల గోకులం షెడ్డును, చల్లపల్లి మండలం రాముడుపాలెంలో నిర్మించిన గోకులం షెడ్డును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు తెలిపారు. మినీ గోకులాల ద్వారా పశు సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలు నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పిస్తూ వివరించారు.

ప్రజలు ప్రభుత్వం కల్పించే వసతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పల్లెపండుగ ద్వారా మినీ గోకులంకు నిధులు సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply