GOLD RATE | బంగారం కొనాలనుకుంటున్నారా?

GOLD RATE | బంగారం కొనాలనుకుంటున్నారా?
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా? అయితే కాస్తా ఆలోచించండి. ఈ రోజు ఉదయం స్వల్పంగా పెరిగిన రేట్లు మధ్యాహ్నం మరింత పెరిగింది. సంక్రాంతి రోజులు కావడంతో రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు ఉదయం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,830గా ఉండగా అది 11 గంటల వరకు 650 పెరిగి ప్రస్తుతం రూ.1,39,480గా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర రూ1,27,260 ఉండగా, మధ్యాహ్నానికి ధర రూ. 1,27,850కి చేరుకుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,39,480గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,850గా ఉండగా ఉదయం రూ1,27,260గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
GOLD RATE | దేశవ్యాప్తంగా…

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన ముంబై, కెరళ, బెంగళూరు కోల్‌కతాలోనూ హైదరాబాద్ తరహా ధరలే కొనసాగుతుండగా చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,40,400కు చేరింది. ఢిల్లీలో 1,39,630 వద్ద కొనసాగుతోంది.
GOLD RATE | వెండి ధర తగ్గేదేలే…
వెండి ధర తగ్గడం లేదు. వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఈ ఒక్క రోజు.. అది కూడా కేవలం మూడు గంటల్లోనే కిలో వెండి రూ.10,000 వేల వరకు పెరిగింది. బుధవారం ఉదయం 6 గంటలకు కేజీ వెండి ధర రూ.2,53,100 వద్ద కొనసాగుండగా ఉదయం 11 గంటలకు ఇది 2,63,000 వేలకు చేరింది.

GOLD RATE | దేశంలోని పలు నగరాల్లో బంగారం రేట్లు
సిటీ 24కే 22కే
చెన్నై రూ.14,040 రూ.12,870
ముంబై రూ.13,948 రూ.12,785
ఢిల్లీ రూ.13,963 రూ.12,800
కోల్‌కతా రూ.13,948 రూ.12,785
బెంగళూరు రూ.13,948 రూ.12,785
హైదరాబాద్ రూ.13,948 రూ.12,785
కేరళ రూ.13,948 రూ.12,785
పుణే రూ.13,948 రూ.12,785
వడోదర రూ.13,953 రూ.12,790
అహ్మదాబాద్ రూ.13,953 రూ.12,790
