MLA | Rs. 13 crore | కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

MLA | Rs. 13 crore | కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

MLA | Rs. 13 crore | మోత్కూర్, ఆంధ్రప్రభ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులలో కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపొందెలా పార్టీ కార్యకర్తలు కృషి చేసి, మోత్కూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్(MLA Samal) అన్నారు. ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఎల్ ఎన్ గార్డెన్ పంక్షన్ హల్ లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల కు పార్టీ కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ లో కొత్త , పాత అనే భేదాభిప్రాయాలు పక్కకు పెట్టి, ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు.

గత ప్రభుత్వ(Government) హయాంలో మోత్కూర్ మున్సిపాలిటీ లో అభివృద్ధి శూన్యమని, ప్రస్తుతం రెండేళ్ల లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మున్సిపాలిటీలో రూ.30 కోట్ల నిధులు మంజూరు కాగా ప్రస్తుతం రూ.5 కోట్లతో పనులు జరుగుతున్నాయని, రూ.2.5 కోట్లతో అంబేద్కర్, జ్యోతి రావ్ పూలే పేరుతో స్టడీ సర్కిల్ మంజూరు అయ్యిందన్నారు. మినహా రూ.13 కోట్ల(Rs. 13 crore)కు సంబంధించి 4,5 రోజుల్లో డి పి ఆర్ రూపొందించి పనులు ప్రారంభిస్తామన్నారు. మున్సిపాలిటీ విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురం గ్రామాల అభివృద్ధి సైతం చేపడతామన్నారు.

Leave a Reply