Narasaraopeta | 1100 సేవలను వినియోగించుకోండి..

Narasaraopeta | 1100 సేవలను వినియోగించుకోండి..

  • జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
  • 5వ తేదీన కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ
  • ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Narasaraopeta | నరసరావుపేట, ఆంధ్రప్రభ : మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివోవి డాట్ ఇన్) వెబ్ సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.

ఈనెల 5వ తేదీన (సోమవారం) నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయాలన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు.

సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్‌కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేసుకోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్‌ను వాట్సాప్‌ లో పంపిస్తున్నామని, ఎండార్స్మెంట్‌ను బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఇస్తున్న అడ్రస్‌కు పంపిస్తున్నామన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్‌గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply