AP Deputy CM | కొండగట్టు అంజన్న సేవలో పవన్ కల్యాణ్

AP Deputy CM | కొండగట్టు అంజన్న సేవలో పవన్ కల్యాణ్
AP Deputy CM | మల్యాల, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రసిద్ధ ఆలయం కొండగట్టు ఆంజనేయస్వామి (Kondagattu Anjaneyaswamy) ని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.35.19 కోట్ల తితిదే నిధులతో 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంతో ఆలయ అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం నాచుపల్లి శివారులోని రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో సమావేశమై మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
