12 Maoists killed | భారీ ఎన్‌కౌంటర్

12 Maoists killed | భారీ ఎన్‌కౌంటర్
12 మంది మావోయిస్టులు మృతి
12 Maoists killed | సుక్మా, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లో మావోయిస్టు కార్యకలాపాలపై భద్రతా బలగాలు జోరుగా కొనసాగిస్తున్న ఆపరేషన్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా (Sukma District) కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన తీవ్ర ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన మావోయిస్టు బలగాలకు మరో దెబ్బ తగిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నారు. ఘటనాస్థలం నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్ (AK-47, INSAS rifles), ఇతర ఆయుధాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు బీజాపుర్‌లో చోటుచేసుకున్న మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
