China Manja | అవి కనిపించవు.. కానీ ఊపిరి తీస్తున్నాయ్!

- అవి గాలికి వదిలేస్తున్నారు!
- చైనా మాంజా వద్దంటే అమ్ముతున్నారు…
- ప్రాణాలు తీస్తున్న పతంగులు
China Manja | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇటు అధికారులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు.. అటు పిల్లలు, యువకులు పతంగులు గాలికి వదిలేస్తున్నారు. తీరా అవి కనిపించవు.. కానీ ఊపిరి తీస్తున్నాయ్! వద్దంటే చైనా మాంజా(China Manja) అమ్ముతున్నారు. నిషేధం ఉన్నా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. పతంగి చూస్తే ద్విచక్ర వాహనదారులు భయందోళన చెందుతున్నారు.
చైనా మాంజాకు గత ఏడాది ఎందరో బలయ్యారు. చైనా మాంజా విచ్చల విడిగా విక్రయించడంతో పిల్లలు, యువకులు కూడా వాటిని వినియోగిస్తున్నారు. గాలిలో ఎగుర వేసిన పతంగులు ఏ విద్యుత్ స్తంభం, కరెంట్ తీగ, మెట్రో పిల్లర్లకు తగిలితే వాటిని అక్కడి విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. మళ్లీ గాలి వీచినప్పుడు ఆ పతంగులు ఎగరడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
China Manja |చైనా మాంజాలు ప్రమాదకరం ఎందుకంటే…

చైనా మాంజాలు నైలాన్‌తో తయారు చేస్తారు. మాంజాకు గాజుని పొడి పూసిన నైలాన్, సింథటిక్ దారాలు మాంజా తయారీలో వాడుతారు. కైంచీ వేసిన సమయంలో చైనా మాంజా తెగకుండా ఉండడంతో పాటు, ఎదుటివారి పతంగ్‌ని తెంపుతుండడంతో చాలా మంది ఈ రకం మాంజా వినియోగిస్తున్నారు. మాంజా ప్లాస్టిక్(plastic) పదార్థంతో తయారయ్యే దారం కావటంతో గట్టిగా, పదునుగా ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో మాంజా చుట్టుకుని పక్షులు, పిల్లలు, ద్విచక్ర వాహనదారులు గాయపడుతున్నారు.
విద్యుత్, ట్రాఫిక్(Electricity, Traffic)కి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ మాంజా తెగకుండా తీవ్రంగా గాయపరుస్తుంది. ఈ మాంజా పొరపాటున ఎవరికి తగిలినా వారు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నారు. డిసెంబర్‌లో గాలిపటం ఎగురుతున్న సమయంలో రోడ్డుపైకి వచ్చిన చైనీస్ మాంజా ఓ మైనర్ బాలుడి మెడను కోసి వేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు 22 కుట్లు వేసి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన నగర ప్రజలను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. నిషేధం ఉన్నప్పటికీ చైనా మాంజా ఎలా బహిరంగంగా వినియోగంలో ఉందన్న ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి.
China Manja |1986 నుంచి నిషేధం…

1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద చైనా మాంజా నిషేధిస్తూ జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం చైనా మాంజా అమ్మినా, వినియోగించినా శిక్షార్హులని ప్రభుత్వం హెచ్చరించింది. జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా(Rs. One lakh fine) కూడా విధించే అవకాశం ఉంది. నిషేధం అమలు ఉన్నా ఏటా చైనా మాంజా వినియోగం తగ్గడం లేదు. గత ఏడాది ఎందరో చైనా మాంజాకు బలియ్యారు. ప్రమాదం జరిగిన ప్రతిసారీ రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు.

China Manja |డిమాండ్ ఉందని అమ్ముతున్నారా?
చైనా మాంజాకు డిమాండ్ ఉందని వ్యాపారులు అమ్ముతున్నారని కొందరు వాదిస్తున్నారు. అయితే వాటిని అమ్మకాలు లేకుండా చూస్తే వాటిని వినియోగించేవారు ఉండరు. వినోదం కోసం మాంజా కొంటున్నారు. కానీ అదే మాంజా ఇతరుల ప్రాణాలను తీస్తోంది. కేవలం సరదా కోసం ఇంతటి ప్రమాదం మాంజా ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వాటిని అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో చైనా మాంజా క్రయవిక్రయాల(Sales)పై కఠిన చట్టాలు అమలు చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నగర పరిధిలో చైనీస్ మాంజా వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని, మాంజాతో గాలిపటాలు ఎగరేసిన వారికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చైనా మాంజాను పూర్తిగా నిషేధించి ప్రజల ప్రాణాలను రక్షించాలని పలువురు కోరుతున్నారు.
CLICK HERE TO READ MORE ముగ్గురు పిల్లలను చంపి..