English Carnival | రబింద్రాలో ఘనంగా ఇంగ్లీష్ కార్నివాల్ ..

English Carnival | రబింద్రాలో ఘనంగా ఇంగ్లీష్ కార్నివాల్ ..

English Carnival | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రంలోని రబింద్రా ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ కార్నివాల్(English Carnival) ను ఘనంగా నిర్వహించారు. రబింద్రా ప్లే స్కూల్, హెస్కూల్ విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ర్యాంప్ వాక్ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సురేష్ పాఠక్, అమీర్ ఖుస్రో, కిషోర్ కుమార్, దాస్, సంపత్, ఇక్బాల్ లు హాజరయ్యారు. విద్యార్థులకు ఆంగ్ల భాష పదాల ఉచ్చారణ, ఆంగ్ల భాష ప్రాముఖ్యత, మొదలగు విషయాలను వివరించారు.

తదనంతరం రబింద్రా పాఠశాల ప్రిన్సిపాల్ సాయినాథ్ మాట్లాడుతూ ఇంగ్లీష్ కార్నివాల్ అనేది. ఒక వినోద భరిత, ప్రత్యేక వేషధారణలతో అలరించే కార్యక్రమం అని, ముఖ్యంగా విద్యార్థులు భాషతో పాటు వివిధ సంస్కృతులను తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.గీతం (భైంసా), లిల్లిపుట్ (ఆర్మూర్, మహత్మ జ్యోతి బాపూలే (ముథోల్), విశ్వం ఎడ్యుకేట్ సంస్థ, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, లేక్చరర్లు, ఉపాద్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply