Veterinary Dr | మేకలు–గొర్రెలకు నట్టల మందుల పంపిణీ

Veterinary Dr | మేకలు–గొర్రెలకు నట్టల మందుల పంపిణీ

Veterinary Dr | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీలో మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని పశుసంపద ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడి మహేశ్వర్, ఉప సర్పంచ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్(Veterinary Dr) దిలీప్ మేకలు, గొర్రెలకు నట్టల వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పశుసంపద ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి(financial situation) కూడా బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కర్ణాటక ఓదెలు, కోల వెంకటేష్, వేల్పుల గంగమల్లు, సిర్రం ఓదెలు, తులసీరామ్, కొమ్ము అనిల్, దైవాల మంజులతో పాటు స్టాఫ్ సభ్యులు రమణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply