Christmas | ఊట్కూర్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Christmas | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూర్, పెద్దపోర్ల, ఊట్కూర్, నిడుగుర్తి తదితర గ్రామాల్లో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఊట్కూర్ శాలెం చర్చిలో పాస్టర్లు ఏసుక్రీస్తు జీవిత చరిత్రను వివరించారు. ఏసు ప్రభు సూచించిన మార్గంలో నడవాలని అన్నారు. క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి ప్రేమ సోదర భావాన్ని చాటి చెబుతుందని అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆయా చర్చిల వద్దకు వివిధ పార్టీల నాయకుల్లో వెళ్లి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఊట్కూర్ చర్చిలో సర్పంచ్ భర్త భరత్ వార్డు సభ్యుడు కొక్కు మల్లేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మాజీ సర్పంచ్ సరోజా సమృద్ధి, ఊట్కూర్ మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్, అంబేద్కర్ సంఘం నాయకులు భరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply