Parliament | బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ

Parliament | బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ

  • కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ..
  • జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు

Parliament | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా తెలుగుదేశం(ountry) పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పార్టీ కార్యాలయం, కర్నూలులో జరిగిన కార్యక్రమంలో ఇప్పటివరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన పాలకుర్తి తిక్కారెడ్డి పార్టీ బాధ్యతలను నూతన నాయకత్వానికి అప్పగించారు. డిసెంబర్‌ 24న పార్టీ జాతీయ నాయకత్వం(national leadership) కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ పేరును, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అధికారికంగా బాధ్యతల బదిలీ జరిగింది.

ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్(Parliament) సభ్యుడు బస్తిపాటి నాగరాజు, మాజీ శాసనసభ్యుడు కే. మీనాక్షి నాయుడు, మాజీ మంత్రి కె.ఈ. ప్రభాకర్, చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, పార్టీ నాయకుడు కె.వి. సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిక్కా రెడ్డి మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024, ఏప్రిల్ 15న జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారని, పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలో కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించామని తెలిపారు. ఎన్నికల్లో(elections) పార్టీకి అత్యధిక స్థానాలు సాధించడంతో పాటు పార్లమెంట్ అభ్యర్థి విజయంలోనూ శక్తివంచన లేకుండా పనిచేశామని పేర్కొన్నారు. 1999 తర్వాత జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచిన ఘనతకు పార్టీ శ్రేణుల సమిష్టి కృషే కారణమని అన్నారు.

అధ్యక్ష పదవిలో మార్పు నేపథ్యంలో జిల్లా పార్టీ నాయకత్వాన్ని గుడిసె కృష్ణమ్మకు అప్పగించామని, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజును నియమించామని తెలిపారు. బీసీలు, మహిళలకు పార్టీ ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఇస్తోందని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళలకు కీలక బాధ్యతలు(Responsibilities) అప్పగించడం శుభపరిణామమని అన్నారు. ఇది పార్టీ బీసీ అనుకూలతను మరోసారి నిరూపిస్తోందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, జిల్లా నాయకుల సమన్వయంతో పార్టీని విజయపథంలో నడిపించేందుకు నూతన అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి కృషి చేయాలని సూచించారు.

Leave a Reply