Parliament | పార్టీ నిర్ణయం శిరోధార్యం..

Parliament | పార్టీ నిర్ణయం శిరోధార్యం..

Parliament | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంట్(Parliament) నియోజకవర్గ అధ్యక్షురాలిగా నియమితులైన గద్దె అనురాధకు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుడ్డ వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ(Vijayawada)లోని అశోక్ నగర్ లో ఉన్న గద్దె అనురాధను ఆమె నివాసంలో ప్రత్యేకంగా కలిసి సన్మానించారు.

జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేసి, సుదీర్ఘ కాలం పార్టీకి సేవలు అందించిన అనుభవం కలిగిన అనురాధను నియమించిన చంద్రబాబు, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయం అయినా శిరోధార్యంగా భావించి, పార్టీ బలోపేతానికి తన వంతు పని చేస్తానని వెంకన్న తెలిపారు.

Leave a Reply