Farmer’s Day | ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

Farmer’s Day | కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఓలా గ్రామంలో ఈ రోజు రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచ్ కట్ట రవి రైతులకు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశానికి రైతే వెన్నెముక్కని వ్యవసాయంలో రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యవసాయం ఆధారంగా జీవించడం, రైతులకు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను గురించి రైతుల్లో అవగాహన కల్పించి మేలు చేస్తాయని పేర్కొన్నారు. రైతు లేనిదే వ్యవసాయం లేదని రైతు దేశానికి వెన్నుముక్కని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజ్ కుమార్, మహిపాల్ శ్యామ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సదాశివ్ పటేల్, విడిసి అధ్యక్షులు నర్సింలు ,శరత్ గౌడ్, సాదు ప్రభాకర్, గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
