Sarpanch | గ్రామ అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తా

Sarpanch | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామాన్ని అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని నూతన గ్రామ మహిళా సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా స్వతంత్ర సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన తనను గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తలపై ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలందరికీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీటిని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు.

గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పాలకవర్గం సభ్యులతో పాటు ప్రజలందరూ సహకరించాలని సర్పంచ్ ధనలక్ష్మి వెంకట్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ దంపతులను గ్రామస్తులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులతో పాటు అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply