Distribution | చేపల ఉత్పత్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

Distribution | బిక్కనూరు, ఆంధ్రప్రభ : మత్స్యకారులు ఉచిత చేప పిల్లలను సద్వినియోగం చేసుకోవాలని పట్టణ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ కోరారు. ఇవాళ కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 88వేల చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ… 100% రాయితీపై చేప పిల్లలు అందించడం జరుగుతుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. చేపల పెంపకం దారులు వాటిని పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పారు.
ఈకార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డీఎఫ్ఓ అధికారి డోలిసింగ్, ఎఫ్ఏ ఇంచార్జ్ బిక్నూర్ జయరాం, అక్తర్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు నారాయణ, బిక్కనూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందే దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు తాటిపాముల లింబాద్రి, జనార్ధన్, గంగల భూమయ్య, గ్రామపంచాయతీ ఈవో మహేష్ గౌడ్, సచివాలయం వార్డు సభ్యులు బసగల చంద్రకళ, ఆకుల రవి, జోర్రిగల మాధురి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబెర్స్ మద్దూరి రవి, కిరణ్, గజ్జె నవీన, గజ్జె సురేష్, ముచ్చర్ల రాంరెడ్డి, కల్లూరి సిద్ధారములు, ఉప్పరి సాయిలు, కర్నాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
