Makthal | బైక్ పై మంత్రి వాకిటి శ్రీహరి

Makthal | బైక్ పై మంత్రి వాకిటి శ్రీహరి
- మక్తల్ పట్టణంలో మంత్రి సుడిగాలి పర్యటన
- సమస్యలు తెలుసుకుంటూ…
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీస్ ల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (vakiti srihari) సుడిగాలి పర్యటన చేశారు. ఉదయమే బైక్ పై బయలుదేరి పట్టణంలోని పలు వార్డుల్లో ప్రతీ గల్లీతిరిగి సమస్యలు తెలుసుకున్నారు. వార్డుల్లో చేపట్టవలసిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు పలు అభివృద్ధి పనులపై అధికారులకు వివరించారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. వార్డులో కలియదిరుగుతున్న మంత్రిని మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటిలో అందరిని పలకరించి వారి బాగోగుల గురించి మంత్రి శ్రీహరి అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో సమస్యలు తెలుసుకోవడానికి ఉదయాన్నే మంత్రి పర్యటించడం పట్ల పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలో పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే వార్డుల్లో పర్యటించడం జరిగిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. సమస్యల పరిష్కారానికి త్వరగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి (minister) వెల్లడించారు. మంత్రి వాకిటి శ్రీహరి వెంబడి కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, కోళ్ళ వెంకటేష్, బి.గణేష్ కుమార్, కావలి తాయప్ప, కట్ట వెంకటేష్, నూరొద్దీన్, ఉసాముద్దీన్, బి.శంషొద్దీన్, పూజ శివరాజ్, బోయ నరసింహ, ఫయాజ్, సాలంబిన్ ఉమర్ బస్రవి, గాయత్రి అనిల్ కుమార్, మున్సిపల్ ఏఈ నాగశివ, తదితరులున్నారు.
